-ఉదయం 6గంటలకే ఊరుబాట పట్టిన ఎమ్మెల్యే
-ఏడు గ్రామాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటన
-లబ్ధిదారుల ఇంటికెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
పొద్దుపొడవ లేదు....వాకిళ్లలో మహిళలు ఇంకా ముగ్గులు పెట్టలేదు...పొయ్యి మీద ఎసరు పెట్టలేదు... ఇంకా కలిమబ్బే కమ్ముకుని ఉంది, కానీ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాత్రం పొద్దుపొడవక ముందే పల్లె ముంగిట్లోకి అడుగుపెట్టి నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తలుపుతట్టి మరి కళ్యాణలక్ష్మీ చెక్కులను ఆడబిడ్డలకు అందజేసి ఆశీర్వదించారు.ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట, పొత్తూరు, కందికట్కూర్, కిష్టారావుపల్లి, వల్లంపట్ల, వంతడుపుల, నారెడ్డిపల్లి గ్రామాల్లో 17 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా అండగా ఉండి, ఆడబిడ్డల వివాహానికి₹1లక్ష116 సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడబిడ్డల పెళ్లిళ్లకు నయాపైసా సాయం అందించలేదని, సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కూడదనే సంకల్పంతో కల్యాణలక్ష్మీ పథకం ద్వారా సాయం అందించి కొండంత అండగా నిలబడుతున్నారని అన్నారు.వచ్చే ఎఫ్రీల్ నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే ప్రభుత్వం దళితబంధు ద్వారా ₹10 లక్షల సాయం అందిస్తుందని అన్నారు. రైతుబంధు పథకంతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు₹10వేల సాయం అందిస్తున్నామని, రైతుభీమా ద్వారా ఏదైనా కారణంతో మరణించిన రైతు కుటుంబాలకు ₹5లక్షల భీమా సదుపాయం కూడా మల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లులేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తున్నామని, త్వరలోనే ఇంటి స్థలం ఉన్నవాళ్లకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రతిపక్షాలు ఎన్ని బురదజల్లే కుట్రలు చేసినా ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు.