తెలంగాణ ఉద్యమకారులను దగా చేస్తూ, ఉద్యమ ద్రోహులను నెత్తిన ఎక్కిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వామపక్షాలతో కలసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు చెప్తున్న తీరు మరోసారి తన కుటిలాత్వాన్ని చూపించారని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ ఒక ప్రకటన పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆరెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజావ్యతిరేకతను చవిచూస్తున్న కేసీఆర్ తన పార్టీ ఉనికి రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారబోతుందనే ఆలోచనతో ప్రజల దృష్టిని మరలించేందుకు రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన వామపక్షాలతో కవ్వింపులు చేస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజాదరణను సహించలేక నైతిక విలువలు మర్చిపోయిన కేసీఆర్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీలతో కలిసేదేందుకు కూడా వెనుకాడటం లేదని, ఇలాంటి అనైతిక రాజకీయా ధోరణితో తెలంగాణ అమరవీరులను అవమనపరిచినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట టీఆరెస్ ప్రభుత్వ పాలన వలన రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, రుణ మాఫీ, ఉచిత ఎరువులు, గొర్రెల పంపిణీ, కేజీ టూ పీజీ, మండలానికి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, డిగ్రీ కళాశాల, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటన లాంటి అంశాలపై దృష్టి సారించాలని, తరువాత జాతీయ స్థాయిలో కేసీఆర్ తన ఉనికి చాటుకోవాలన్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక వయోపరిమితి కూడా పూర్తి కావడంతో ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలను కూడా ఓదార్చలేని కేసీఆర్ తన పదవిని కాపడుకోవాడానికి తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల పరిష్కరానికై ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని లేనియెడల ప్రజల పక్షాన బీజేపీ పార్టీ నాయకులు పోరాడుతామన్నారు.