- సీఎం కేసీఆర్ పై రాజద్రోహం కేసును నమోదు చెయ్యాలి
- అధ్యక్షులు ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల్ పసుల వెంకటి.
ఇల్లంతకుంట వార్తలు:
భారత రాజ్యంగాన్ని మార్చడం అంటే దేశంలోని సబ్బండ వర్గాలను అవమాణించడమేనని ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పసుల వెంకటి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ, అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారత రాజ్యంగాన్ని అవమానపరిచిన సీఎం కేసీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. దేశంలో మార్చాల్సింది ఏది లేదని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న సీఎం కేసీఆర్ ను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సర్వ మతాలు, సబ్బండ వర్గాలు తమ అభిమతంగా భావించే భారత రాజ్యంగాన్ని కించపరిచేలా మాట్లాడ్డం సీఎం కేసీఆర్ పాలన తీరుకు నిదర్శనం అని అన్నారు. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తిని, రాజ్యాంగన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయనకు రాజ్యాంగ బద్ధమైన పదవిలో మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తే, అదే రాజ్యాంగన్ని మార్చాలని మాట్లాడ్డం చూస్తుంటే కూర్చున్న కొమ్మనే నరికేసే ద్రోహిగా సీఎం కేసీఆర్ తనకు తానే ముద్ర వేసుకున్నాడన్నారు. ప్రజలపై గాని, భారత రాజ్యాంగం పట్లగాని గౌరవం లేని వ్యక్తికీ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వెనువెంటనే సీఎం కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తాను రాజ్యాంగం రాసుకుని, ప్రజామోదం పొందాకనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. భారత రాజ్యాంగం అమలులో ఉన్నంతకాలం అయన ప్రజాక్షేత్రంలోకి రావాలిసిన అవసరం లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ఏ రాజ్యాంగం అడ్డుపడిందో కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. హామీలు అమలు చెయ్యడం చేతకాక, ప్రజల్లో అధికార టీఆరెస్ పై వస్తున్నా అక్కసును దాచుకోలేక ప్రెస్ మీట్ పేరుతొ తన ఆవేదన, అక్రశం వెలిబుచ్చారాని అన్నారు. బాధ్యతయూతమైన హోదాలో ఉండి, తన స్థాయిని మర్చి భారత రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ పై సెక్షన్ 124-ఏ కింద దేశాద్రోహం కేసును నమోదు చెయ్యాలని, రాష్ట్రపతి జోక్యం చేసుకొని సీఎం కేసీఆర్ ను పదవి నుంచి భర్తరఫ్ చెయ్యాలని వెంకటి విజ్యాప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ జేంస్ సెక్రెటరీ ముత్యాల మల్లారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ బీసీ సెల్ మండల అధ్యక్షులు తాట్ల వీరేశం మండల ఉపాధ్యక్షులు గూడా నరేందర్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జమాల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ మండల సీనియర్ నాయకులు ఎలగందుల ప్రసాద్ బద్దం రమణా రెడ్డి తో పాటు తదితరులు ఉన్నారు.