ప్రభుత్వం గూడు లేని అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లను అందించాలనే లక్ష్యం తో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ చైర్మన్ అధికారులను ఆదేశించారు.శనివారం మండలం లోని కందికట్కూరు గ్రామంలో
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూచనల మేరకు డబుల్ బెడ్రూమ్ వద్ద పూర్తయిన పనులను,వాటర్ ట్యాంక్ లను,సౌకర్యాలను పరిశీలించారు.డబుల్ ఇళ్లను త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీవో రాజు, సర్పంచ్ అమర్ గౌడ్, ఉపసర్పంచి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, పొన్నం శేఖర్ గౌడ్, పరుశరాములు, నాగరాజు, ఐలయ్య, శ్రీకాంత్, గంగరాజు, గుంటి మధు పాల్గొన్నారు.