మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామానికి చెందిన వోరగంటి యువసేన నాయకుడు జేరిపోతుల అనిల్ తండ్రి మరణించగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సూచనలమేరకు ఇల్లంతకుంట మండల వోరగంటి యువసేన నాయకులు అనిల్ కుటుంబాన్ని పరామర్శించి స్వల్ప అవసరాల రిత్య వారికి 50 కిలోల బియ్యం,నిత్యావసర సరుకులు అందజేశారు, ఈ సందర్భంగా యువసేన నాయకులు మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొల్లం కనకయ్య బట్టి చంద్రమౌళి ఎల్లయ్య దాసు నిఖిల్ నాగరాజ్ నవీన్ హరీష్ చింటూ తదితరులు పాల్గొన్నారు.