ఇల్లంతకుంట వార్తలు. ఫిబ్రవరి.02/22:మానకొండూర్ నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామంలోని మాదాసు రాజేష్ (కన్నయ్య) గారు అనారోగ్యంతో మరణించగా.తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సూచనలమేరకు ఇల్లంతకుంట మండల వోరగంటి యువసేన నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి స్వల్ప అవసరాల రిత్య వారికి 50 కిలోల బియ్యం అందజేశారు, ఈ సందర్భంగా యువసేన నాయకులు కన్నయ్య కుటుంబానికి అన్ని విధాలుగా చేయూతను అందిస్తామని కన్నయ్య కుటుంబానికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది.ఈ కార్యక్రమంలో జేరిపోతుల అనిల్ కుమార్, పైడిపాల మహేందర్, తోడేటి అరవింద్, రాగటి రమేష్,చంద్రమౌళి, మహేందర్,శ్రీకాంత్,శేఖర్,అనిల్, వోరగంటి యువసేన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.