పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొన్న జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం లో సిద్దం వేణు ముఖ్య అథితిగా పాల్గొని రాజన్నశ్రీ సిద్దం వేణు దళితులకు పౌర హక్కుల పై అవగాహన కల్పించారు. షెడ్యూల్ కులాలు, తెగలకు రాజ్యాంగం అనేక రకాల హక్కులను కల్పించిందని వివరించారు. ఎవరైనా హక్కులకు భంగం కలిగిస్తే పోలీస్ స్టేషన్ తో పాటు సంబంధిత వ్యవస్థలను ఆశ్రయించాలని వారికి సూచించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్ గౌడ్,ఎమ్ పి డి ఓ జోగం రాజు,స్థానిక సర్పంచ్ బిల్లవేణి పర్శరామ్,మండల అంభేడ్కరం సంఘం అధ్యక్షులు తడకపెల్లి భూమయ్య, ఉప సర్పంచ్ బత్తిని కావ్య స్వామి,వార్డ్ సభ్యులు నరేష్ ,బుచ్చిరెడ్డి,కవిత వెంకటెశం తదితరులు పాల్గొన్నారు.