మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

0


మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్  కందీకట్కూర్ గ్రామంలో  అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా గ్రామ పంచాయతీకి మంజూరు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు కంది కట్కూర్ లో  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ లేకుండా నేరుగా గ్రామ పంచాయతీ లకు అందించడం ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఇదివరకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ఫ్రిజ్ చేయడంతో గ్రామాల అభివృద్ధి కి నిధులు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. కాగా కేంద్రం ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి సర్పంచ్, ఉప సర్పంచ్ పేరిట సంయుక్తంగా కొత్త ఖాతా ప్రారంభించి గ్రామపంచాయతీ జనాభా ప్రాతిపదికన ప్రతి వ్యక్తికి 1760/- కేంద్రం ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం తీసుకొచ్చిన ప్రధాని మోడీ కి అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమం లో,  భూమల్ల ప్రశాంత్,
,తాళ్ల పెళ్లి మోహన్,  జంగిటి అజయ్, చీకటిమల్ల సతీష్,,చదవాలా  శీను, చదవాలా  సంతోషం,నాగరాజు, సాయి, నాగరాజు  పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top