విద్యుత్ శాఖ ఏఈ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా రాస్తారోకో
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఏఈ ఆఫీస్ ముందు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంఐఎం అడ్డాలో పాతబస్తీలో 1000 కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలు ఉన్నాయి అట్టి బకాయిలను వెంటనే వసూలు చేయ వలసింది గా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఎంఐఎం అంటే నీకు లాగులు తడుస్తుంది కానీ పేద ప్రజల పైన అధిక భారం మోపడం నీకు సబబు కాదని డిమాండ్ చేస్తుంది అక్కడ మోడీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు కలిసి సామాన్య ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారు ఇకనైనా జ్ఞానోదయం కలిగి పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం లేనియెడల అధికారపార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్ లను ముఖ్యమంత్రిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించిన ఉన్నాం ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్ బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముత్యాల మల్లారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు లగేజ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ మండల ఉపాధ్యక్షులు గూడా నరేందర్ రెడ్డి మండల కార్యదర్శి నేత బాబు మండల యూత్ నాయకులు అక్కినపల్లి సురేష్ మండల నాయకులు కొట్టిపల్లి పరుశరాములు సుధ గోని తిరుపతి గౌడ్ గాలి పల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మంజూర్ అలీ రేపాక గ్రామ శాఖ అధ్యక్షులు దయాసాగర్ కుమార్ రెడ్డి కిష్టయ్య రాజయ్య బాబు నరేష్ లింగం తదితరులు పాల్గొనడం జరిగింది.