అవ్వ మీకు దండం మంచిగున్నారా..
బువ్వ తిన్నారా ఏమో బాగా ముచ్చట పెట్టుకుంటుండ్రు అంటూ పేదల పెన్నిధి, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆప్యాయంగా ముచ్చటించారు.
మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామంలోని దళిత కాలనీలో ఇటీవల మృతి చెందిన ఓ బాధిత కుటుంబాన్ని ఈరోజు ఆయన పరామర్శించి తన కారులో తిరుగు పయనమయ్యారు.
ఓఇంటి ముందు ఇద్దరు తల్లులు కూచొని ముచ్చటింస్తుండగా రసమయి కారు దిగి నేరుగా వెళ్లి వారితో సమానంగా నేలపైనే కూచున్నారు. సుమారు అరగంట పాటు వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ కొడుకులు, బిడ్డలు ఎందరు, ఏం పని చేస్తున్నారు, పింఛన్ వస్తుందా అంటూ వారి మంచి చెడులు అరసుకున్నారు.
మాకేంది బిడ్డా మాపెద్ద కొడుకు కేసీఆర్ నేల కాంగనే పింఛన్ పైసలు ఇస్తుండు, కడుపు నిండా తింటున్నాం, హాయిగా ఉంటన్నం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఎంత ఎదిగినా ఒదిగిన నైజం రసమయన్నకే దక్కింది. అరగంట పాటు నేలపైనే కూర్చొని వారితో ముచ్చటిస్తూ
కన్ను మూసిన తన కన్నతల్లిని యాది చేసుకుంటూ ఇద్దరు తల్లుల ఆత్మీయతను పొందారు.