మండల అభివృద్ధి ఎక్కడో జివి రామకృష్ణ చెప్పాలి.

0



మండల అభివృద్ధి ఎక్కడో జివి రామకృష్ణ చెప్పాలి.

మండల కాంగ్రెస్ అద్యక్షుడు. పసుల వెంకటి.

మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని కరీంనగర్ జిల్లా తెరాస అధ్యక్షుడు జివి. రామకృష్ణ అనడం కాదు ఇల్లంతకుంట వచ్చిఅభివృద్ధిని చూపించాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసులవెంకటి డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేనన్నారు.నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు సార్లు గెలిచినజిల్లా కేంద్రానికి రోడ్డు వేయలేని దుస్థితన్నారు.మండల తలపున వున్న జలాశయాలు ఈ ప్రాంత రైతుల పంటలకు నీరివ్వని పరిస్థితులున్నాయన్నారు. మానకొండుర్ గడ్డ పై పుట్టినబిడ్డ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి రజినీకాంత్, ముత్యాల మల్లారెడ్డి ,బాలయ్య, ప్రసాద్ ,చంద్రయ్య, మల్లయ్య, లింగం ,రాజేశం తదితరులున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top