-
- అసెంబ్లీలో ప్రస్తావించిన గౌరవ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి
...........................................
దళితుల విద్యుత్ బకాయి బిల్లులను మాపీ చేసి, నూతన మీటర్లు ఇప్పించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు
గత ప్రభుత్వాలు కరెంట్ బిల్లులు కట్ట కూడదని దళితులకు హామీ ఇచ్చి మోసం చేశారని, దీంతో బిల్లులు చెల్లించక పోవడంతో తడిసి మోపెడై లక్షల్లో పెరుకుపోయాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి బకాయి బిల్లులను మాపీ చేసి దళితులకు నూతన మీటర్లు వెంటనే ఇప్పించాలని ఎమ్మెల్యే రసమయి కోరారు
అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మండల కేంద్రం వరకు మరియ జిల్లెల x రోడ్డు నుండి ఇల్లంతకుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.