తెరాస అసత్య ప్రచారం మానుకోవాలి

0
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో బిజేవైఎం మండల కార్యదర్శి భూమల్ల ప్రశాంత్ తెరాస  రాజకీయాలను ఖండించారు. అధికార దుర్వినియోగం చేస్తూ పెయిడ్ ఐటీ సెల్ ద్వారా సోషల్ మీడియాలో తెరాస అసత్య ప్రచారానికి దిగిందని ఆరోపణ చేశారు. ఎవరైనా వారి అసత్య పోస్ట్ లను ప్రశ్నిస్తే దాడులు చేయడం, పోలీస్ వ్యవస్థ ను వాడుకొని అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది అని అన్నారు . ఎల్లారెడ్డిపేట లో సోషల్ మీడియాలో ని  అసత్య ప్రచారం ను ప్రశ్నించి నందుకు తెరాస నాయకులు బిజేవైఎం నాయకుడు రామచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళి బెదిరించారు..ఈ బెదిరింపు పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన రామచంద్ర రెడ్డి , అతని స్నేహితులను తెరాస నాయకులు పోలీస్ ల ముందు పోలీస్ స్టేషన్ లో కొట్టడం జరిగింది.ఈ వీడియో లు చిత్రీకరణ చేసిన ఫోన్ లను తెరాస నాయకుడు అగయ్య పగల కొట్టడం జరిగింది. అయినప్పటి కి దాడికి సంభందించిన అనేక ఆధారాలను బిజేవైఎం నాయకులు సమర్పించారు. ఆధారాల ను కోర్టు వాళ్ళు స్వీకరించి బిజేవైఎం నాయకుల పై పెట్టిన అక్రమ రిమాండ్ కేసులను కొట్టివేయడం జరిగింది. ఇంత జరిగిన తెరాస నాయకులు బిజెపి వాళ్ళు మమ్మల్ని కొట్టారు అనడం ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజానీకం గమనిస్తున్నారు. అధికార దుర్వినియోగం, పోలీస్ రక్షణ వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్న తెరాస గూండాలు రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోవాలి.దాడుల కు ప్రతి దాడి చేయడానికి వెనుకాడేది లేదని ఈ సందర్భంగా బిజేవైఎం నాయకులు ప్రశాంత్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top