రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణా ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన మండల బీజేపీ నాయకులు.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమే, ఈ తెరాస ప్రభుత్వం తప్పులను, అవినీతినీ, ప్రజల పక్షాన అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులు రాజసింగ్ ,రఘనందన్ రావు , రాజేందర్ ప్రశ్నిస్తే ముగ్గురు ఎమ్మెల్యే లు అసెంబ్లీలో ఉంటే తెరాస ప్రభుత్వం దోపిడీ ఆటలు సాగవని అకారణంగా అసెంబ్లీ సమావేశాలు ముగిచేవరకు సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో దహనం చేస్తూబెంద్రం తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడతూ.. రాష్ట్ర గవర్నర్ నీ బడ్జెట్ సమావేశంలోకి పిలవకపోవడం అవమాంచడమేనన్నారు, రాష్ట్రలో ప్రశ్నించే గొంతుకులను అనగాతోక్కడం ప్రజాస్వామ్యన్ని ఖుని చేయడమేనన్నారు. దేశంలోనే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1 అవినీతి ప్రభుత్వమన్నారు, ఇలాంటి దోపిడీ దొంగల ప్రభుత్వనికి గవర్నర్ అంటే భయమే, ప్రజలు అంటే భయమే,బీజేపీ అంటే భయమేనన్నారు.మరి మీరు ఇంకెన్నాళ్లు ఈ చీకటి పరిపాలనా చేస్తారనీ మండిపడ్డారు. మీ తెరాస పాలనతో రాష్ట్రము లో నీ ప్రజలందరు విసుగుచేందియున్నారాన్నారు.. వెంటనే రాష్ట్ర గవర్నర్ నీ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ , శాసనసభ స్పీకర్ క్షమాపణ కోరాలన్నారు. శాసనసభ సంప్రాదాయలను కాపాడాలన్నారు.ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యే లపై ఆకారణంగా చేసిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలన్నారు. లేని పక్షంలో రాష్టమంతటా ప్రజాందోళన కార్యక్రమలు తీవ్రతరం చేస్తామన్నారు, ఈ తెరాస ప్రభుత్వంన్ని ప్రజలలో దోషిగా నిలబెడతామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న కుమార్,మండల బీజేపీ ఉపాధ్యక్షుడు పయ్యావుల ఎల్లం. మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజ్, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, బతిని స్వామి చల్లురి భాను అంతటి వేణు,కుంటల సాయి .దురుముట్ల ప్రశాంత్. తుమ్మ పవన్. పెంట అక్షయ్.ముడపెళ్లి కోటి తదితరులు పాల్గొన్నారు.