బిక్కావాగులోకి నీళ్లు వెంటనే విడుదల చేయాలి

0



రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వయార్ లు  రెండు  జలాశయలు వున్నా బిక్కావాగులోకి నీళ్లు ఓదాలక, బావులు ఎండిపోయిన,నీళ్లు లేక పంట పొలాలు ఎండుతూన్నాయని రైతులకి మద్దతుగా ధర్నా చేస్తున మండల బీజేపీ నాయకులు.
ఇల్లంతకుంట మండలంలో రైతుల వ్యవసాయ బావులలో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్న పట్టించుకోకుండా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  తీరుతో  బిక్కవాగు బిడ్జి పై రైతులకు మద్దతుగా ధర్నా చేస్తూ బెంద్రం తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. మన ఇల్లంతకుంట మండలం లో  మిడ్ మానేరు, అనంతగిరి  అన్నపూర్ణ రిజర్వాయర్, రెండు జలాశయాలు ఉన్నా  మన ఇల్లంతకుంట మండలానికి మాత్రం నీళ్లు వదలరనీ ఈ తెలంగాణా పైసల మంత్రి హరీష్ రావు  తన సిద్దిపేట  స్వంత నియోజకవర్గంలోనీ రెండవసారి కూడా 125  గ్రామాలలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు నింపుకొని ప్రతి ఎకరాకు నీరు కాలువల ద్వారా ఇస్తుంటే అక్కడ మన నీళ్లతో వాళ్ళు సంబరాలు జరుపుకుంటుంటే, మన ఇల్లంతకుంట మండల రైతులకేమో  కన్నీళ్లు వస్తున్నాయి  పంటలు ఎండిపోయిన పట్టించుకోని మన  మండల టిఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు  ఇంకనైనా మీరు మారారా మీకు మన ఇల్లంతకుంట మండల ప్రజలే ఓట్లు వేయలేదా,  మిమ్మల్ని గెలిపించింది సిద్దిపేట  హరీష్రావు దొర నా  చెప్పండి మరి మీకెందుకు ఇంత భయం ఈ దొరలు అంటే  మండలంలోని  తెరాస ప్రజాప్రతినిధులు  నీళ్లు ఇడిపించకుండా పోలీస్ అధికారులపై ఒత్తిడి చేసి ధర్నాను ఆపే ప్రయత్నం చేయడం కన్నా రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వకుండా మౌనంగా ఉండీ  రైతులను  మోసం చేయాలనుకుంటే మిమ్మల్ని కూడా  ఈ రైతులు మీ రాజకీయ జీవితానికిబొంద  పెడ్తారు మర్చిపోకండన్నారు,, మన నీళ్లు మనం అడిగడానికి కూడా భయపడేలా  మన నీళ్లను దొంగలాగా ఎత్తుకెళ్తున్న వాళ్ళు భయపడాలి మీరెందుకు  బయపడుతున్నారు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల్లారా  మీరు వెంటనే నోరు విప్పి  ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  వద్దకు వెళ్లి నీళ్లు విడవమనీ పంట పొలాలకి  బిక్కవాగు ద్వారా నీళ్లు విడవాలన్నారు, ఇరిగేషన్ ఏఈ సమరశెన్  20 రోజులలో బిక్కావాగులోకి నీళ్లు ఇడుస్తామని రైతులకి  హామీ ఇవ్వడంతో ధర్నా నీ విరమించిన రైతులు, ఏఈ  ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు, నీళ్ల కోసం రైతులు ప్రజలు వేచి చూస్తావున్నారన్నారు.ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు కముటం.పర్శరాములు,చెలిమిలల.కానుకయ్య, కసుపాక.మైసయ్య, బైరి. ఎల్లయ్య, నల్గొండ.స్వామి, చెలిమిల. కనుకయ్య, పెంకాసు.ప్రవీణ్,జెట్టి కనుకయ్య,పల్లె.భగవాన్ రెడ్డి,జెట్టి.అర్జున్, పల్లె మల్లారెడ్డి,కాసుపాక.కిషన్,పల్లె. బాపురెడ్డి, నడిగొట్టు కనకయ్య, సింగరి పర్శరాములు,పల్లె మోహన్ రెడ్డి,దామ శేఖర్,కొండిగోప్పుల విజయ్, కట్ట.పోచయ్య,బొల్లారం ప్రసన్న,బోయిని రంజిత్, దండవేణి రజినీకాంత్,నాగసముద్రాల సంతోష్,బత్తిని స్వామి,బండారి రాజ్, తిప్పారపు.శ్రవణ్,మామిడి హరీష్,పల్లె సాయిప్రసాద్ రెడ్డి,కుమ్మరివేణి మహేందర్,జె హరికృష్ణ,అంతటి వేణు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top