ఇల్లంతకుంట మండలంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన చేపట్టడం జరిగినది.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన అసెంబ్లీని స్పీకర్ నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాలను సజావుగా నడిపించాలని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ సి ఎల్ పి నాయకులు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాలు నడవాలని స్పీకర్ కి చెప్పుటకు 30 నిమిషాలు నిలబన స్పీకర్ కన్నెత్తి కూడా చూడకుండా ప్రతిపక్ష నాయకుడైన భట్టి విక్రమార్క ని అవమానించడం సరైనది కాదని టిపిసిసి అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పిలుపుమేరకు
టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని స్పీకర్ అసెంబ్లీని సజావుగా నడపాలని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మండల మైనర్టీ అధ్యక్షుడు జమాల్ మండల ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి రజినికాంత్, బిసి సేల్ అధ్యక్షుడు తాట్ల వీరేశం, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ ,యసి సి సేల్ కన్వీనర్ జుట్టు నగేష్ , మచ్చ రాజేశం బెజ్జంకి రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.