రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ వారసంతను ప్రారంభించారు.అనంతరం రసమయి మాట్లాడుతూ అన్ని గ్రామాలలో ప్రజల సౌకర్యాలను మెరుగు పరుస్తూ మౌలికమైన వసతులను కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.వారసంత ద్వారా వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధ్దికి కీలకంగా మారుతందిని అన్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు కలుగుతున్నదని అన్నారు.
వారసంతను అందుబాటులోకి తేవడంతో ఈ ప్రాంత ప్రజలకు అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయని వారు అన్నారు.తెలంగాణ ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ది పథంలో పరుగులు పెడుతున్నాయి,పట్టణాలతో పోటీ పడుతున్నాయని అన్నారు.గ్రామస్థులు ఐక్యంగా ఉంటె ఏదైన సాదించ వచ్చు అని అన్నారు.నాటి ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అంటే నేడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని నిరూపించారని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు , ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనాథ్ గౌడ్ , స్థానిక సర్పంచ్, వార్డ్ సభ్యులు , టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.