తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

0
 


 ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని డాక్టర్ కట్ట రమేష్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
 ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ
 ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో  హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వైద్య సిబ్బంది ప్ర‌తి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న వ్య‌క్తుల ఆరోగ్య స‌మాచారాన్ని పూర్తిగా సేక‌రిస్తారు.
 హెల్త్ ప్రొఫైల్ లో  వ్య‌క్తి యొక్క సమ‌స్త ఆరోగ్య స‌మాచారాన్ని పొందు ప‌రుస్తారు. తెలంగాణలోని రైతు బంధు , రైతు బీమా, 24 గంటల కరెంట్ , కల్యాణ లక్ష్మి వంటి పథకాలు . దేశానికి ఆదర్శం అయినట్టు  హెల్త్ ప్రొఫైల్ కూడా ఆదర్శం అవుతుందని అన్నారు.ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో  డాక్టర్ కట్ట రమేష్ , ప్రోగ్రాం సూపర్ వైజర్ రాజేందర్ , ఉప సర్పంచ్ బత్తిని కావ్య - స్వామి , వార్డు మెంబెర్ కూస నరేష్ , నాయకులు బత్తిని మల్లయ్య , ఏ. న్. ఎం అబిదా భాను , కుద్దూస్ , ఆశా కార్యకర్తలు  ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top