భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

0

భారతీయ జనతా పార్టీ  ముఖ్య కార్యకర్తల సమావేశం


ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో  భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఎలుక రామ స్వామి ఆధ్వర్యంలోముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి బిజెపి దళిత మోర్చా జిల్లా ఇన్చార్జ్ బాల్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు చంటి మహేష్  ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ఇట్టి సమావేశంలో సంస్థాగతమైన  విషయాల పైన చర్చించడం జరిగింది. తదనంతరం వారు మాట్లాడుతూ దళిత ద్రోహి కెసిఆర్ పదే పదే దళితులను మోసం వస్తున్నారు అని ఇంకా మోసపోవడానికి దళితులం సిద్ధంగా లేము అని అన్నారు. స్వరాష్ట్ర సాధన అనంతరం దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని నమ్మపలికి యేండ్లు గడుస్తున్న దళత ముఖ్యమంత్రి మూసే లేదు అన్నారు. దళితులకు 3ఎకరాల భూమి ఏడ అని,120 అడుగుల డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ట చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది అని ప్రశ్నించారు దళితులకు పెద్ద పీట వేస్తూ దళితుల అభ్యున్నతి కోసం పాటుపడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా మాణకొందూర్ నియోజక వర్గంలో  బిజెపి జెండా ఎగరడం కాయం అని అన్నారు.  ఈ  కార్యక్రమంలోబీజేవైఎం రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు జింక అనిల్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ ఎస్సి మోర్చా మండల  ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్, గొర్రె అఖిల్,  ఎస్సి మోర్చా  మండల నాయకులు ఎలుక వర్ధన్, యాస సన్ని, బొలుమల్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top