-పలు గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులే ఆర్థిక వనరులు.
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కొరకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వినియోగించుకోవాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులు లేక అభివృద్ధి పనులు చేపట్టని పరిస్థితులలో గ్రామ పంచాయతీలు ఉన్నాయని బీజేపీ మండల ప్రధానకార్యదర్శి నాగసముద్రాల సంతోష్ ఒక ప్రకటన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులకు నిధులకు గాను గత కొన్ని నెలలుగా సర్పంచులు ఎదురుచూస్తున్నారని, సొంత నిధులతో పనులు చేయలేక, చేసిన పనులకు బిల్లులు ఎప్పుడు వస్తాయో అనే ఆలోచనలతో పనుల నిర్వహణ పూర్తిగా మందగించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే విడుదల చేస్తున్నప్పటికీ పరిమితి ఆంక్షలతో విద్యుత్ బకాయిలు, మంచినీటి పథకాల నిర్వహణ, విధి దీపాలు నిర్వహణ, ఇతర అవసరాలకు ఆ నిధులను వినియోగిస్తున్నారన్నారని తెలియపారు. కేంద్రం నిధులు ఇస్తే తప్ప చేసిన పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదన్నారు,
దీనితో అభివృద్ధికి వినియోగించాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులను జీపీ మెయింటెనెన్స్, ట్రాక్టర్ ఈఎమ్‌ఐ, డీజిల్ ఖర్చులు, డ్రైవర్, మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు, కరెంట్ బిల్లులకు వినియోగిస్తుండగా గ్రామాల మేజర్ పనులకు ఆటంకాలు ఏర్పడి మధ్యలోనే వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిదన్నారు.
వివిధ గ్రామాల సర్పంచులు అధికార పార్టీకి సంబంధించిన వారు కాబట్టి ఎదురు చెప్పలేని స్థితి పనులకు గానూ వెచ్చించిన డబ్బులతో రాక అప్పుల బాధ భరించలేక అగోమ్యగోచరంగా మారిందన్నారు.
కాగా గ్రామ స్వరాజ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసి ఏటా గ్రామ పంచాయతీ లకు అందించే నిధులకు అదనంగా తాగునీరు, శానిటేషన్, సౌకర్యాల కల్పన, ప్రజా వసరాల మెరుగు కోసం కట్టుబడి మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు రూ.31,765 కోట్లను అదనపు గ్రాంట్ ఎయిడ్ విడుదల చేశారన్నారు, ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.682.50 కోట్లను అదనపు గ్రాంట్ ఎయిడ్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కోట్ల రూపాయలు ఇస్తున్నమని గొప్పలు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం కనీస పనులకు నిర్వహణకు కూడా నిధులు అందించడం లేదని పైగా కేంద్ర ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్భం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి పరిస్థితులలో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీల సొంత ఆదాయమే గ్రామాల్లో ప్రజల అవసరాలను తీర్చేందుకు వనరులు కాగా ఆర్థిక సంఘాల నుండి విడుదలైన నిధులతో పాటు అదనపు గ్రాంట్ ఎయిడ్ నిధులు ఊరట కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ లకు నిధులు విడుదల చెప్పుకోవడం కాదు చేతలాలో చూపించి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.