కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలను, వెంటనే తగ్గించాలి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ధర్నా డ్రామాలను బంద్ చేయండి
- కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ
నేడు మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ చార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు
ఈ సందర్భంగా డా.కవ్వంపల్లి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ చార్జీల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు
కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అయిపోయిన తర్వాత ఇలా ధరలు పెంచడం సరైనది కాదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే ఇప్పుడు బిజెపి ప్రభుత్వం 1050 సిలిండర్ ధర పెంచడం సామాన్య ప్రజలపై భారం మోపి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రష్యా నుండి చమురు ధర తక్కువ ధరకు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్పిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు.
విద్యుత్ సంస్థలకు కరెంటు బకాయిలు చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం వేయడం సరికాదు వెంటనే పెంచిన ఛార్జిలు తగ్గించాలన్నారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్,విద్యుత్ ఛార్జిలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.ఎల్ గౌడ్, కొమ్మేర రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి,నందగిరి రవీంద్ర చారీ,గోపగోని బస్వయ్య,చిట్కూరి అనంతరెడ్డి,పసుల వెంకట్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, ఎంపీటీసీలు,జిల్లా,మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.