తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రజలందరు వినియోగించుకోవాలి
- ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ
ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తారు.
హెల్త్ ప్రొఫైల్ లో వ్యక్తి యొక్క సమస్త ఆరోగ్య సమాచారాన్ని పొందు పరుస్తారు. తెలంగాణలోని రైతు బంధు , రైతు బీమా, 24 గంటల కరెంట్ , కల్యాణ లక్ష్మి వంటి పథకాలు . దేశానికి ఆదర్శం అయినట్టు హెల్త్ ప్రొఫైల్ కూడా ఆదర్శం అవుతుందని అన్నారు... ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిని పద్మ , వార్డు మెంబెర్లు అన్నాడి నవీన్ రెడ్డి , చింతకింది నర్సయ్య , నాయకులు దొమ్మాటి అనిల్ గౌడ్ , ఏ. న్. ఎం కవిత , ఆశా కార్యకర్తలు విజయ , పద్మ, సౌమ్య కారాబారి శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.