జంగం రెడ్డి పల్లి గ్రామంలోని మహిళా మండలి సభ్యులకు తడి చెత్త పొడి చెత్త, హానికరపు చెత్త, మరియు పారిశుద్ధ్యం ప్లాస్టిక్, నియంత్రణ పై అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ శ్రీమతి తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు వుట్కూరి వెంకటరమణారెడ్డి హాజరై తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు అందజేయాలని తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమాలో జిల్లా స్వచ్ఛ భారత్ కోఆర్డినేటర్ సురేష్ హాజరై ఇంకుడు గుంతల వలన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు మరియు ప్లాస్టిక్ వాడటం వలన జరుగుతున్న నష్టాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఏ పీ ఎం వాణిశ్రీ, ఉపన్యాసకులు రామకృష్ణారెడ్డి , ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, సి ఎ రజిత, వివో అధ్యక్షురాలు సరిత, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, మరియు గ్రామంలోని మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు