రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మండల బీజేపీ నాయకులు
భారతదేశంలోనీ ప్రజలందరికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (ఉచిత రేషన్) పథకాన్ని మరో 6 నెలలు (సెప్టెంబర్ వరకు) పొడగిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో నరేంద్ర మోదీ జీ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ భారత దేశంలోనీ 80 కోట్ల ప్రజలకి ఉచితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోదీ అదనంగా 5 కేజీల బియ్యం/ గోధుమలు కిలో పప్పు కరోనా కష్ట కాలంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గత రెండు సంవత్సరాలనుండి ఉచితం గా అందిస్తున్నారన్నారు, ఇప్పుడు మల్లి ఇట్టి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నా నిర్ణయం మరో 6 మాసాలు సెప్టెంబర్ వరకు పొడగించి ఉచితంగా రేషన్ 5 బియ్యం, గోధుమలు, కిలో పప్పు ఇస్తున్నందుకు ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున నరేంద్ర మోది జీ గారికీ కృతజ్ఞతలు తెలుపుతవున్నామన్నారు,ఈ కార్యక్రమం లో జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల.శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని.రంజిత్, ప్రధాన కార్యదర్శిలు నాగసముద్రాల. సంతోష్, బత్తిని.స్వామి, బీజేపీ యువమోర్చ అధ్యక్షులు బండారి.రాజు, బీజేపీ నాయకులు చల్లూరి భాను, దూది.సుదీర్ రెడ్డి, మామిడి. అనిల్,తదితరులు పాలుగోన్నారు.