సెస్ ఎన్నికలు జరపాలని, సెస్ లోని అవినీతిపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకుల నిరసన

0


రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికలు జరపాలని, సెస్ లోని అవినీతిపై విచారణ జరిపించాలని, ఇల్లంతకుంట మండల సెస్ సభ్యుల సేవా సదన్ ముందు నిరసన చేసిన మండల బీజేపీ నాయకులు.
సిరిసిల్ల సెస్ కు ఎన్నికలు జరుపకుండా తెరాస ప్రభుత్వం  చేస్తున్న నిర్లక్ష్యం పై ఇల్లంతకుంట మండల సెస్ సభ్యుల సేవా సదన్ ఆఫీస్ ముందు ఎన్నికలు జరపాలని నిరసన చేస్తు బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ.. సిరిసిల్ల విద్యుత్ సెస్ సహకార సంఘానికి  పాలకమండలి పదవి కాలం అయిపోయాక కూడా ఎన్నికల నోటిఫికేషన్ వేయడం లేదు ఎల్లక్షన్స్ జరపడం లేదు, ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో తెరాస ప్రభుత్వం పైన వున్నా సెస్ వినియోగదారుల వేతిరేకత, రైతుల అసంతృప్తి,గత సెస్ పాలకుల్లోనీ కొంతమంది తెరాస పాలకుల అవినీతి వలన  ఇప్పుడు ఎన్నికలు జరిపితే గెలవమనే ఆలోచనలతో  సెస్ ఎన్నికలు వాయిదాలు వేస్తూ ప్రత్యేక అధికారుల పాలనా కొనసాగిస్తున్నారు ఐనా అవినీతి అంతంకావడం లేదుగాక  ఎక్కువ అవుతావుందన్నారు, ఇల్లంతకుంట  కాళేశ్వరం వర్క్ కు ఈ -టెండర్ ద్వారా 7000000 డెబ్బయి లక్షలు రూపాయలు తో టెండర్ పిలిచి సెస్ మేనేజ్మెంట్ కు  సంబందించిన వ్యక్తులు పాలుగోనకపోయేసరికి ఈ టెండర్ నీ కాన్సల్ చేసి, మళ్ళీ కొద్దీ రోజులకి టెండర్ కి గౌరవ సెస్ MD గారికీ సంబందించిన కృప ఎలక్ట్రీకల్ కంపెనీ కాంట్రాక్టర్ ఫేక్ టవర్ సర్టిఫికెట్ తో పాలుగోన్నారు, అట్టి ఫేక్ సర్టిఫికెట్ కృప ఎలక్ట్రీకల్ కంపెనీ వారు పాల్వంచ డివిజన్ నుండి  అనుభవం ఉన్నట్లు  2017 లో తెచ్చిన సర్టిఫికెట్ పెట్టారన్నారు, అసలు పాల్వంచ NSPDL ఐనా అది డివిజన్ కాదు, వాస్తవానికి ఇప్పటికి కూడా సెక్షన్ ఆఫీస్ మాత్రమేపాల్వంచ,డివిజన్ ఇంజనీరింగ్  పోస్ట్ ఆఫీస్ పాల్వంచ కి లేదన్నారు, కృప కాంట్రాక్టర్ ఎక్స్పీరియన్స్ 1800 km వున్నట్లు ఫేక్ సర్టిఫికెట్ పాల్వంచ ఆఫీస్ నుండి ఇచ్చినట్టు పెట్టారన్నారు,అసలు పాల్వంచ ఆఫీస్ పరిధి నుండి 100 km మించి సర్టిఫికెట్ ఉండదన్నారు, మేనేజ్మెంట్ అవినీతికి పాల్పడుతు ఫేక్ కంపెనీ లతో  టెండర్లను అధిక రేట్లుకి వేయించి పర్సంటేజ్ లకు కకృత్తి పడి ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, ఫేక్ సర్టిఫికెట్ తో  కలెక్టర్ ని తప్పుతోవ పట్టించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసికొని,గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో ఆగమేఘాలమీద గంటల వ్యవదిలో  అవార్డు చేపించిన అధికారిపై చర్యలు తీసుకొని, వెంటనే సెస్ కి ఎన్నికలు జరిపి ప్రభుత్వ ప్రజాధనన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలన్నారు, తక్షణమే సెస్ ఎలక్షన్స్ జరిగేలా ప్రభుత్వన్నిడిమాండ్ చేస్తున్నామాన్నరు ఈ నిరసన కార్యక్రమం లో జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు గుంటి మహేష్,ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, కథ మల్లేశం,దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్,దళిత మోర్చా ఉపాధ్యక్షులు మామిడి హరీష్,ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,దూది.సుదీర్ రెడ్డి,చల్లూరి భాను, అంతటి వేణు వెల్డింగ్.చంద్రం,గొర్ర అఖిల్, దురుముట్ల ప్రశాంత్,బొంగొని.శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top