ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు పసుల వెంకటి ఆధ్వర్యంలో గత ఎన్నికల్లో టీఆర్ యస్ ప్రభుత్వం మండలానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తు నల్ల బ్యాడ్జిలతో ర్యాలీగా వెళ్లి రాస్తరోకో చేయడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలానికి ఇచ్చిన హామీలు తప్ప కోత్తగా కోరికలు కోరుతలేమని ఇచ్చినవి శాసనసభలో మాట్లాడి తీసుకురావలని లేదంటే శాసనసభ్యులు రసామయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మండల మైనర్టీ సేల్ అధ్యక్షుడు జమాల్, బిసి సేల్ అధ్యక్షుడు తాట్ల వీరేషం, మండల ఉపాద్యక్షుడు నరేందర్ రెడ్డి ,కిసన్ సేల్ కన్వీనర్ మల్లరెడ్డి, యసి సేల్ జిల్ల కన్వీనర్ జుట్టు నగేష్, యువజన కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ , న్యాతబాబు , ప్రదాన కార్యదర్శి అల్లేపు రజనీకాంత్, అనంతగిరి, కుంటయ్య, సంతోష్ బాబు ,రాజు,రాజేందర్ రెడ్డి , బత్తిని పర్షరాం, తిరుపతి , రమణ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.