ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి పై అవగాహన గురించి, నివారణ గురించి ర్యాలీ

0

ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా క్షయ వ్యాధి పై  అవగాహన గురించి,  నివారణ గురించి  ర్యాలీ

ఈరోజు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం  సందర్భంగా క్షయ వ్యాధి పై  అవగాహన గురించి, మరియు నివారణ గురించి  ర్యాలీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో బాగంగా 2025 వరకు క్షయ వ్యాధి అంతం చేయడం   గురించి మరియు టిబి అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రెండవ టాప్  infectious killer మరియు దీని యొక్క లక్షణాలు 
రెండు వారాలకి మించి దగ్గు, జ్వరం
రాత్రి పూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం,బరువు తగ్గడం,కఫం లో రక్తం పడటం
టిబి ఎవరికైనా ఏ వయసు వారికైనా రావచ్చు  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు అనగా వృద్దులు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
   టిబి అనేది మానవ శరీరంలో ఏ భాగము కైన రావచ్చు- ఊపిరితిత్తులకు,కడుపు,మెదడు, వెన్ను పూస, కిడ్నీ, గర్భసంచి మొదలగు ఏ అవయవము కైనా సోకవచ్చు.
      ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం నుండి నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రాం క్రింద ప్రతి నెలా ఎసిఎఫ్ క్యాంపు మరియు మన PHC లో టిబి వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించి మరియు నివారణ కు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా TB సోకిన వారికి ప్రతి నెలా 500 రూ.లు వారి పొషణ కోరకు వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అశ్రద్ధ చేయకుండా లక్షణాలు కనబడిన వెంటనే తెమడ పరీక్ష చేయించుకోగలరని వ్యాధి నిర్దారణ అయిన వారు డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తి కోర్సు (6 నెలల నుండి 2సంవత్సరముల వరకు) మందులు క్రమం తప్పకుండా వాడితే టిబి నీ పూర్తి గా నయం చేయవచ్చని మండల వైద్యాధికారి డా. కట్ట రమేష్ తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top