ఈ మార్చి లోపు గ్రామాలలో మిగిలి ఉన్న పెండింగ్ పనులను సర్పంచులు, ప్రజాప్రతినిధులు పూర్తి చేయాలని ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం లో మండల పరిషత్ అధ్యక్షులు ఉట్కూరి వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ పెండింగ్ పనులపైన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సర్పంచ్ లు ఎన్ ఆర్ఇజీఎస్ పనులన్ని పూర్తి చేయాలని, పంచాయతీరాజ్ పై ఇబ్బందులుంటే తెలుపలన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ, పంచాయతీ రాజ్ డి. ఈ సుదర్శన్ రెడ్డి, ఏ. ఇ. అజారుద్దీన్,సర్పంచులఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ, మరియు మండలము లోని వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది.
మిగులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
March 15, 2022
0
Share to other apps