జిల్లా స్థాయి సంఘ సమావేశాలు

0
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్  శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి సంఘ  సమావేశాలు బుధవారం నిర్వహించారు.

_విద్య, 🩺వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్ కమిటీలకు జడ్పీ చైర్ పర్సన్ గారి అధ్యక్షత వహించగా, 🌾వ్యవసాయం పై వైస్ చైర్మన్  సిద్ధం వేణు, స్టాండింగ్ కమిటీ అధ్యక్షత వహించారు.
▫️ _ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి  మాట్లాడుతూ   మంత్రివర్యులు కేటీఆర్  ఆదేశాల ప్రకారం పంటల మార్పిడి పై జిల్లాలోని రైతులను  ఆశ్వరావు పెట్ లో ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కోసం విజ్ఞాన యాత్రకు పంపించడం జరుగుతుంది.  మన  ముఖ్య మంత్రి వర్యులు కెసిఆర్  ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కొసం మన ఊరు మన బడి అనే ఒక బృహత్తర కార్య్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మన ఊరు మన బడి లో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 172 పాఠశాలలు ఎంపిక కాబడ్డాయి. పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన కల్పించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంసిద్ధం చేయలన్నారు. విద్యార్థులకు మంచి మధ్యాహ్న భోజనాన్ని  అందించాలన్నారు.పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న  మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలన్నరు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటినీ అందించాలని అన్నారు.గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడిలలో నాణ్యమైన గ్రుడ్లను అందించాలి. పిల్లలలో పోషకాహార లోపం రాకుండా తగిన మోతాదులో పోషన్ అభియాన్ ద్వారా పోషకాహారలను అందించాలన్నారు. జిల్లాలోని ప్రతి  మహిళ వారి ఆత్మ రక్షణకు  సఖి సెంటర్ ను సద్వినియోగం పరుచుకొనేలా మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. 

జిల్లాలోని_ వయోవృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలని అన్నారు.  గ్రామాలలో ఏర్పాటు చేసిన నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతుల శ్రేయస్సు కోరి  రైతు బంధు,రైతు భీమా లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు._

ఈ సమావేశంలో జడ్పీటీసీ లు  కొమిరిశెట్టి విజయ, గట్ల మీనయ్య, గుండం నర్సయ్య, నాగం కుమార్, కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, అహ్మద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి గౌతం రెడ్డి గారు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top