డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు
భారత మాజీ ఉప ప్రధాని, కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 115 వ జయంతిని (ఏప్రిల్ 5) పురస్కరించుకుని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ ఈ రోజు TRS పార్టీ SC సెల్ మండల అధ్యక్షులు పసుల బాబు గారి అధ్యక్షతన ఇల్లంతకుంట మండల కేంద్రం లో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి స్మరించుకున్నారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు హజరై వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత బాబూ జగ్జీవన్ రామ్ అని అన్నారు. తర తరాలుగా సామాజిక ఆర్థిక సామాజిక వివక్షకు గురౌతున్న దళిత సమాజాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల ఆశయాల సాధన దిశగా దళిత బంధు వంటి పధకాలను అమలు చేస్తున్నదన్నారు. తద్వారా సామాజిక ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్త శుద్దితో కృషి చేస్తున్నదని అన్నారు.
వారితో పాటు ఇట్టి కార్యక్రంలో ఇల్లంతకుంట సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు,సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు చల్ల నారాయణ,ముస్కానిపేట MPTC సావనపెల్లి వనజ అనిల్ కుమార్,మాజీ సర్పంచ్ మామిడి సంజీవ్,మీసరగండ్ల అనిల్ కుమార్,BCసెల్ అధ్యక్షులు పెద్ది రాజు, మండల పార్టీ ఉప అధ్యక్షులు మాంకాలి బాబు ,బుర్ర బాలకిషన్ ,సావనపెల్లి రాకేష్,సవనపెల్లి శంకర్ కాసుపాక శంకర్, ఎలుక రాజయ్య,రాజ్మాహమ్మద్,మచ్చ ప్రభాకర్,ర్యాగటి దేవదాసు,రఘు,పుష్ప,కనుకయ్య,తదితరులు పాల్గొన్నారు_.