కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in )
ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట్ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తదనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్
అతిచిన్న వయసులోనే తొలిప్రధాని పండిట్ జవహర్లార్ నెహ్రూ ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా, తరువాత కాలంలో కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వహించారు. తరువాత కాలంలో భారత ఉపప్రధానిగా దేశానికి అద్వితీయమైన సేవలను అందించారు.
దళితులకు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హక్కులను ప్రసాదిస్తే.. వాటిని చట్టరూపంలో అమలు చేసేందుకు జగ్జీవన్ రామ్ చేసిర హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది.
ఆ మహనీయుడికి జయంతిరోజున ఘననివాళులు అర్పిస్తూ... పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ జుట్టు నగేష్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సంతోష్ బాబు పాల్గొన్నారు.