విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఎంపిపి వుట్కూరి వెంకట రమణారెడ్డి

0
 

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
 ఎంపిపి  వుట్కూరి వెంకట రమణారెడ్డి

 
వైధ్య సిబ్బంది ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారికి అవసరమున్న వైధ్య సేవలను ఎప్పటికప్పుడు అందించాలని  ఎంపిపి , ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్  వుట్కూరి వెంకటరమణారెడ్డి  అన్నారు.  శుక్రవారం హస్పీటల్ ను ఆయన తనిఖీ చేశారు. రోగులను ఆస్పత్రిలో అందిస్తున్న వైధ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోజు వారి ఓపి రిజిష్ట్రార్ ను పరిశీలించారు. వైధ్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ఇప్పటివరకు 40 శాతం పైగా హెల్త్ ఫ్రోఫైల్ పూర్తి కావచ్చిందని , మిగిత శాతం త్వరగా పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, వైధ్యుల సూచనలు పాటించాలన్నారు. జిల్లా వైధ్య ఆరోగ్య అధికారి నేతృత్వంలో ఈ నెల ఎంపిపి  అధ్యక్షతన సోమవారం వైధ్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top