విజయ డెయిరి ని ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామ సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ ప్రారంభించినారు.
అనంతరం జితెందర్ గౌడ్ మాట్లాడుతూ పాడి తో ప్రత్యామ్నాయ ఉపాది ఉంటుందన్నారు. అన్నదాతలు సాగుతోపాటు పాడి పరిశ్రమ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి పొందాలని అన్నారు. విజయ డెయిరీకి పాలు విక్రయించి లాభాలు గడించాలని అన్నారు.
రైతులు బర్రెలు, ఆవులను పెంచుకునేలా అధికారులు చేయూతనందించాలని కోరారు. పాడి రైతులకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నదని తెలిపారు.పాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు పాడి పశువులను పెంచాలని కోరారు.
ఎస్సి కార్పోరేషన్ నుండి పెద్దలింగాపూర్ గ్రామ దళితులకు 16యునిట్లు 16మందకి
(మనషికి రెండు బర్లు) చొప్పున 32బర్లకు సాంక్షన్ ఇవ్వడం జరిగింది.ఇట్టి లబ్దిదారులకు బ్యాంక్ సూరిటి కొరకు విజయ డైరీ వారు ఒప్పుకున్నారు..ఈ సంధర్భంగా తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ కి మరియు విజయ డెయిరీ బృందానికి నా తరుపున మరియు గ్రామ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎంపిటిసి కరివెద స్వప్న కర్నాకర్ రెడ్డి,EX.ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి,జిల్లా ఎస్సి ,ఎస్టీ అట్రాసిటీ మెంబర్ పసుల బాల్ రాజ్,ఉప సర్పంచ్ కుమార్, వ్యవసాయ కార్మీక శాఖ జిల్లా కార్యదర్శి గన్నేరపు నర్సయ్య,నాయకులు పసుల నర్సయ్య,బాబు,తదితరులు పాల్గొన్నారు.