జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు స్వంత నిధులతో గ్రంధాలయం అందజేసిన డా.కవ్వంపల్లి
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in )
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం పెద్దలింగపూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కోసం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ తన స్వంత నిధులతో గ్రంధాలయం ఏర్పాటు చేయించగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ - అనురాధ ప్రారంభించారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్,ఎంపీటీసీ గ్రామ పెద్దలు డా.కవ్వంపల్లి దంపతులను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డిఈవో రాధాకిషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ సర్పంచ్ గోడిశాల జితేందర్ గౌడ్,ఎంపీటీసీ కరివేద స్వప్న కరుణాకర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పసుల వెంకట్ ఎస్ఏంసి చైర్మన్ రాజమహ్మద్ మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.