ప్రమాదవశాత్తు మిడ్ మానేరులో పడి యువకుల మృతి

0
ప్రమాదవశాత్తు మిడ్ మానేరులో పడి యువకుల  మృతి

ప్రమాదవశాత్తు మిడ్ మానేరు లో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ని కందికట్కూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే  మండలంలోని రేపాక, గ్రామానికి చెందిన, శ్రీనివాస్ గౌడ్,తంగల్లపల్లి మండలానికి చెందిన పొన్నం రాజ,అజయ్ బందువులు మానేరు వాగులో గంగా స్నానానికి వెళ్ళారు. బస్వపూర్ కు చెందిన బాలసాని అజయ్ అనే మైనర్ బాలుడు స్నానం చేయుటకు వాగులో దిగాడు.రిజర్వాయర్ నుండి గత నాలుగు రోజులనుండి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అజయ్ అనే బాలుడు వాగులో కొట్టుకోవడం తొ బాలుడి కాపాడే ప్రయత్నంలో కుర్ర శ్రీనివాస్,పొన్నం రాజు నీటిలో మునిగిపోయి గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న మండల ఎస్సై మామిడి మహేందర్ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.అప్పటికే రాజు ,శ్రీనివాస్ మృతి చెందారు.గాలింపు చర్యలో భాగంగా ఎస్సైమహేందర్,ఎఎస్సై మోతీరాం సైతం నీటి ప్రవాహంలో దిగి గాలింపు చర్యలో పాల్గొని సాటి అధికారులకు ఆదర్శంగా నిలిచారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top