కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం లా దిష్టిబొమ్మ దగ్దం
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in ) :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ,వంట గ్యాస్ ధరల కు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ,రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది
->ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే నిర్ధాక్షణ్యంగా పేద ,మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెట్టారు ఆ ప్రజల నడ్డివిరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతోటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ యధేచ్చగా పెట్రోల్, డీజిల్ ,వంటగ్యాస్ ధరలను పెంచడం యావత్ భారతదేశానికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది భారతదేశ స్వాతంత్రం అనంతరం కేవలం 2,3 పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన బిజెపి ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ఈ దేశాన్ని కుబేర చేతిలో పెట్టడానికి పన్నాగం పన్నిందని కానీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన టువంటి ,ఈ దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబడటానికి ,
ఈ దేశాన్ని అనేక రంగాలలో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఇటుకలు పేరుస్తూ ఈ దేశాన్ని నిర్మించిందని ఈ దేశాన్ని అమ్మే ఆలోచనను బీజేపీ ప్రభుత్వం వెంటనే మానుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు
->అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో గల్లీలో కుస్తీ -ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మీరు పెంచితే సరిపోతుందా మేము కూడా పెంచుతాం పేద ప్రజల నడ్డి విరుస్తాం అంటూ ఒకరికొకరు పోటాపోటీగా ధరలను పెంచుకుంటూ సామాన్యులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రభుత్వాల తీరు ఉందని దుయ్యబట్టారు అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలో దీక్ష చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు సూటిగా రెండు ప్రశ్నలు అడగడం జరిగింది రైతుల కోసం దొంగ దీక్షలు ఆపి కేంద్ర ప్రభుత్వం తోటి చర్చించి భేషజాలకు పోకుండా రాష్ట్రం యొక్క రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తప్పా అధికారంలో ఉన్నటువంటి నాయకులే ఈ విధంగా రోడ్లపైకి రావడం ఆశ్చర్యమేస్తుంది నిజంగా ఈ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తెలిపారు రైతులు పండించిన ప్రతీ గింజను కొనే వరకు రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తమ మొండి వైఖరిని విడనాడి ప్రజలు ఇచ్చిన సమయాన్ని దేశ అభివృద్ధి ,కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప ఈ విధంగా ధరలను పెంచి ప్రజలను నట్టేట ముంచే కార్యక్రమాన్ని విరమించుకోవాలని లేనిపక్షంలో ఆనాడు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలను పెంచి ఏవిధంగానైతే బషీర్బాగ్ సంఘటనను చవిచూశారు ఇప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించని ఎడల ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఈ చంద్రునికి కూడా బషీర్బాగ్ సంఘటనను పునరావృతం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచి పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గేవరకు పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మానకొండూరు యూత్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ బిసి సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్ మండల ప్రధాన కార్యదర్శి వల్లెపు రజనీకాంత్ బద్దం రమణారెడ్డి ఎండి సుధ గోని రాజ మల్లయ్య వర్గల్ బాలమల్లు ఆదిరెడ్డి భగవాన్ రెడ్డి రాజు యాదవ్ రాములు తిరుపతి గౌడ్ సంతోష్ బాబు అంజయ్య మోహన్ రామచంద్రం ఎస్సీ సెల్ మండల అధ్యక్షురాలు గజ్జల కరుణ ముజాఫర్ మంజూర్ అలీ హైదర్ బాబు పరుశరాములు తాళ్ల పెళ్లి రాజు గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, లింగం గన్ పరుశరాములు రాజేశం గ్రామాల శాఖ అధ్యక్షులు , పాల్గొన్నారు.