కేంద్ర ప్రభుత్వము వరి ధాన్యం కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ నాయకుల నిరసన
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in) :
యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇల్లంతకుంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
పల్లె నర్సింహరెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో
తెలంగాణలో పండిన వరిధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తే కేంద్ర బీజేపీ సర్కారు రైతులను, ప్రజలను అవమానించిందని, బీజేపీ సర్కారు వైఖరికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్లా జిల్లా జడ్పీ వైస్ చైర్మేన్ సిద్దం వేణు ఎంపీపీ వూట్కూరి వెంకట రమణా రెడ్డి హజరై మాట్లాడుతూ
యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీర్మానాన్ని బలపరచాలన్నారు. ఇంత కాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయని, గత యాసంగి నుంచి కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని, అందుకే కొన్ని సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని అన్నారు.
తెలంగాణ రైతుల వరిధాన్యం సేకరణలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వివక్ష చూపుతుందని అన్నారు.రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని అన్నారు.దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.గత ఏడాదిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం సేకరణపై లేనిపోని ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదిని అన్నారు. తెలంగాణ రైతాంగంలో, ప్రజల్లో మన ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అన్నారు.
ఈ కార్యక్రమానికి PACS చైర్మేనులు,అన్ని గ్రామాల సర్పంచ్ లు, MPTC సభ్యులు,మాజీ ప్రజా ప్రతినిధులు,PASC సభ్యులు,జిల్లా,మండల,గ్రామ నాయకులు,ఉప సర్పంచ్ లు,రైతు బంధు జిల్లా,మండల గ్రామ,అధ్యక్షులు,వార్డు సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు,డైరెక్టర్లు,సీనియర్ నాయకులు,TRS పార్టీ శ్రేణులు ,రైతులు,హజరైనారు.