దళిత బంధు వెంటనే అమలు చేయాలని బిజెపి నాయకుల నిరసన
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రాష్టంలో దళిత బందు ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంకా దళిత బందు ఇవ్వకపోవడంతో ధర్నా చేసిన ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు
తెలంగాణా రాష్ట్రములోనీ ప్రతి దళిత కుటుంబనికి దళిత బందు ద్వారా 10 లక్షలు రూపాయలు నవంబర్ 4 తేది నుండి ఇస్థానాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చి నేటి రోజుకి 150 రోజులు గడిచిపోతున్న దళిత బందు ఇవ్వకపోవడంతో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ధర్నా చేస్తూ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడతూ.. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు రూపాయలు చొప్పున దళిత బందు అందించాలని,ప్రతి నెల 4 వ తేదీన నిరసన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 4 వ తేదీ లోపల దళిత బందు ఇవ్వకపోతే రసమయి బాలకిషన్ నీ నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామాన్నారు, మండలంలో ప్రజా ఆందోళన కార్యక్రమం తీవ్రతారం చేసి Mla కి బుద్ది చెప్తామున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని.రంజిత్, దండవేణి. రజినీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి లు నాగసముద్రాల సంతోష్, బత్తిని స్వామి, పట్టణ శాఖ అధ్యక్షులు తిప్పారపు శ్రావణ్, జిల్లా నాయకులు దామెర కృష్ణ, బొల్లారం. ప్రసన్న, నాయకులు చెప్యాల.గంగాధర్, పొన్నం. కృష్ణ, దూది. సుదీర్రెడ్డి, పున్ని రాజు, అంతటి వేణు, పెంటలా అక్షయ్ తదితరులు పాలుగోన్నారు.