రైతు భీమా - కుటుంబానికి ధీమా

0

రైతు భీమా - కుటుంబానికి ధీమా

ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in )
 వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతులు వివిధ కారణాలతో కొండికొప్పుల తిరుపతి,పండుగ లక్ష్మి లు మరణించగ ఈ రోజు తెలంగాణ  సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్  రసమయి బాలకిషన్ వారికి ఒక్కొక్కరికి 5లక్షల రూ!!చొప్పున 10లక్షల రూపాయల చెక్కులను అందించిన రసమయి .
 రసమయి మాట్లాడుతూ రైతు అకారణంగ  మరణం చెందితే ఆ రైతు కుటుంబాలకు ధీమా ఉండాలనే ఉదేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భీమా అమలు చేస్తున్నదని అన్నారు.
దేశానికి వెన్నుముక అయిన రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలలో ఒకటి రైతు బీమా అని అన్నారు. రైతు బంధు పథకంతో పాటు రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు ఎవరైనా అనుకోని ప్రమాదం వల్ల మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని,రైతు బంధు పథకానికి అర్హులైన రైతులందరూ కూడా రైతు బీమా పథకాన్ని పొందవచ్చు అని అన్నారు. రైతు బంధుతో పాటు రైతు బీమా పథకానికి నిధుల విషయంలో ఎలాంటి లోటు లేకుండా చూసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.24,254 కోట్లను కేటాయించిందని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top