ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలి

0

ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలి

ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in )
 తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 8న, మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండా ఎగరాలని  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్  పిలుపు నిచ్చారు. 
 ఈరోజు సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటీసీలు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, రైతుబంధు సమితి మండల కన్వీనర్లు, సింగిల్విండో చైర్మన్లు మరియు ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. 
 ఈ సంధర్బంగా రసమయి  మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను కొనాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పాటించుకోక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. 
 కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .కేటీఆర్  పిలుపు మేరకు మానకొండూర్ నియోజకవర్గంలో పలు నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 
 ఇందులో భాగంగా రేపు మంత్రి గంగుల కమలాకర్  ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో వద్ద నిర్వహించే రైతు నిరసన దీక్షకు మానకొండూర్ నియజకవర్గం నుంచి సుమారు 3 వేల మంది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు రైతులు తరలి వెళ్లడం జరుగుతుందని ఆయన వివరించారు.  
 అదే విధంగా ఎల్లుండి మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నల్ల జెండాల నిరసనతో పాటు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహన కార్యక్రమాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని నరేంద్ర మోడీ పాలనకు చమర గీతం పాడాలని ఎమ్మెల్యే రసమయి  కోరారు.
 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top