పేదలకు వరం..ఉపాది హమీ పథకం

0
పేదలకు వరం..ఉపాది హమీ పథకం
 ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ ( www.ellanthakunta.in )
ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని పొత్తూర్ గ్రామంలో కొత్తకుంట కట్టకు ఉపాది హమీ పనులను ప్రారంభించిన రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్  సిద్దం వేణు అనంతరం సిద్దం వేణు మాట్లాడుతూ పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మండల వాసులకు వరంగా మారిందని అన్నారు._పనిదినాలు సైతం ఎక్కువగా ఉండటంతో నిధులు అధిక మొత్తంలోవస్తున్నాయని అన్నారు.ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత అభివృద్ధికి తగిన పనులను ఎంపిక చేసి కూలీలకు పని కల్పించాల్సి ఉంటుందని అన్నారు.తద్వారా కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఏటా కూలీల బడ్జెట్‌ తయారు చేసి వాటికి సరిపడా పనులు, జీవనోపాధుల బలోపేతానికి, గ్రామానికి అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన, ఉమ్మడి వనరుల అభివృద్ధికి అంచనాలను తయారు చేసి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. ఇందులో ప్రధానంగా బావులు, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకం, కందకాలు,మరుగుదొడ్ల నిర్మాణం, నీటి తొట్లు, పండ్ల తోటల పెంపకం, నీటి నిల్వలకు సంబంధించిన పనులు, ప్రభుత్వ పాఠశాలలో వంటశాలల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో  సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్, ఎం పి టి సి పట్నం అశ్విని శ్రీనివాస్, ఉపసర్పంచ్ బండార్ పరశురాముడు గౌడ్,సింగిల్ విండో డైరెక్టర్ చెరుకు శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధం నరసయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కదిరి శేఖర్ ,EGS సిబ్బంది రేణుక,లత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top