పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం
మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, జవారిపేట, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి, ఇల్లంతకుంట గ్రామాల్లోని 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా లబ్దిదారుల ఇంటింటికి ఎర్రటి ఎండలో వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దనే ఆశయంతో సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి అంకురార్పణ చేసి ఆడబిడ్డల పెళ్లికి ₹లక్ష 116 సాయం చేస్తున్నారన్నారు. గాలిపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త బుర్ర కనకయ్య ఇంటికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా కళ్యాణలక్ష్మీ చెక్కు ఇవ్వడానికి వెళ్లగా కనకయ్య- ఇందిరా దంపతులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికారు.
జడ్పీ వైస్ ఛైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణ రెడ్డి, , సింగిల్ విండో చైర్మన్ అనంతరెడ్డి, ఎంపీడీఓ రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సర్పంచ్ లు వాణి, పద్మ, శ్రీలత, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు శ్యామల, వనజ, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.