"సమాజంలోని అసమానతలకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడు"

0

"సమాజంలోని అసమానతలకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్ముడు"
ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మహాత్మజ్యోతిరావుపూలే 195 వ జయంతి వేడుకలు
SFI ( భారత విద్యార్థి ఫెడరేషన్)  జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్

  ఈ రోజు రాజన్నసిరిసిల్ల ఇల్లంతకుంట మండల SFI ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునిక యుగ నిర్మాతగా మహాత్మ జ్యోతిరావు పూలే  195వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా sfi జిల్లా అధ్యక్షులు మంద అనిల్  కుమార్ మాట్లాడుతూ... 
సమాజంలో వేళ్ళూనుకున్న ఛాందస విధానాలను ప్రశ్నిస్తూ వంచన విధానాలను ఎత్తి చూపటంలో సఫలీకృతు డయ్యారు. అగ్రకుల అణచివేతలను, అధర్మ నీతులను ఏకరువు పెట్టారు. బ్రాహ్మణ వాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడానికి శాయశక్తులా కృషిచేశారు. విప్లవాత్మక ఆలోచనలను, యదార్థ జీవన చిత్రాలను సామాన్య ప్రజలకు పరిచయం చేశారు. సమాజ వికాసానికి అడ్డంకిగా ఉన్న బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి అదే అగ్రవర్ణాలలో నిరాదరణకు గురైన మహిళల కోసం ఆశ్రమాన్ని స్థాపించి వారికి బాసటగా నిలిచారు. సనాతన వాదాన్ని ప్రచారం చేసే అగ్రవర్ణాలవారు శూద్ర, అతిశూద్రులను ఏవిధంగా దోచుకున్నదీ వివరించారు. మెజార్టీ మత సంప్రదాయంలో భాగమైన దశావతారాలకు చరమగీతం పాడుతూ సమకాలీన సందర్భాలను చెబుతూ చారిత్రక సత్యాలతో ''గులాంగిరీ''ని రచించారు.
మద్యం షాపులు ఏర్పాటు చేయటాన్ని, మద్యం మత్తులో కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవటాన్ని వ్యతిరేకించారు.1873లో ''సత్యశోధక్‌'' సమాజాన్ని స్థాపించారు.చాతుర్వర్ణ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించారు. రైతుల, కార్మికుల సమస్యలపై విస్తృతంగా పనిచేయటంలోనూ, మానవీయ విలువల్ని బోధిస్తూ యదార్థ మార్గాలను చూపడంలోనూ దీని పాత్ర కీలకంగా నిలిచింది. సత్యాగ్రహ ఉద్యమాన్ని మొట్టమొదట ఆచరణలో పెట్టిన మహనీయుడు జ్యోతీబా. స్త్రీలు, రైతులు, కార్మికులు, శ్రామికులు, శూద్ర, అతిశూద్ర ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఆలోచించి సమస్యల పరిష్కారానికి సత్యాగ్రహోద్యమం అనే ప్రతిఘటనోద్యమాన్ని ఎన్నడో ఆచరించి చూపారు. స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది. స్త్రీ స్వేచ్ఛను కాంక్షించిన వారిలో ఫూలే అగ్రగణ్యుడు.మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తింపబడే ఘనతను తన భార్యకు అందించిన సమానత్వ స్థాపకుడాయన. చదువు జ్ఞానాన్ని ఇస్తుందని, జ్ఞానం సంస్కారాన్ని ఇస్తుందని నమ్మిన వాడు ఫూలే.

 విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట కృషిని గౌరవిస్తూ 1852లో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను రెండు దుశ్శాలువాలతో సత్కరించింది.నిమ్నకులాల్లో విద్య ద్వారా మాత్రమే మార్పును తీసుకురావటం సాధ్యమవుతుంది.
విద్యనందించటం ద్వారా అపారమైన జ్ఞాన సంపదను పొందుతారని మీరామెకు తెలియజేయండి అని విన్నవించారు. ''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు.
ఇంతటి మహోన్నత భావాలను, దూరదృష్టిని కలిగి ఉన్నారు కాబట్టే డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ తన గురువుల్లో ఒకరిగా ఫూలేను ప్రకటించుకున్నారు. కొత్త సమీకరణలు, నవీన ఆలోచనలు జ్యోతిరావుపూలే లోని విభిన్న కోణాలను స్పృశించటంలో ముందడుగు వేశాయి.ఆయనలోని ఎన్నో అభ్యుదయ భావాలను బయట ప్రపంచానికి ఎలుగెత్తి చాటాయి.స్త్రీలకు నిర్బంధ విద్యా విధానాన్ని ప్రకటించే వరకూ సాగించిన ఉద్యమంలో జ్యోతిబా పాత్ర గణనీయమైంది.''విద్య లేకపోతే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం లేకపోతే అభివృద్ధి లోపిస్తుంది. అభివృద్ధి లేకపోతే సంపద నశిస్తుంది'' అని గాఢంగా విశ్వసించారు. నేటి సమాజంలోని విద్యార్థులు, ప్రజలు కార్మికులు, మేధావులు అందరు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. 
కార్యక్రమంలో మండల కార్యదర్శి సొల్లు సాయి,అఖిల,నందిని,రేఖ,లిఖిత,కడగండ్ల వినిత్,సూరు అభిషేక్, ఎద్దు వెంకటేష్, రడంసుమిత్,సొల్లు సాయిరాం,మహేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top