నర్సరీ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని నర్సరీ ని ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ సర్పంచ్ బిలవేణి పర్శరాములు తో కలిసి సందర్శించారు... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని మండలంలోనే మొదటి స్థానం లో ఉండాలని అన్నారు.. రహీంఖాన్ పేట గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు... వీటిలో ఎక్కువగా పండ్ల మొక్కలు , పూల మొక్కలు పెంచుతున్నారు అని అన్నారు.. వచ్చే హరితహారం లో నాటే మొక్కల కోసం ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు సూచించారు .. వచ్చే జులై నెలలో హరితహారం కార్యక్రమం ఉంటుందని అన్నారు..ఈ సందర్భంగా నర్సరీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు... ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిలవేణి పర్శరాములు , టెక్నికల్ అసిస్టెంట్ మహేష్, వార్డు మెంబెర్ కూస నరేష్ ,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ , నాయకులు దొమ్మాటి అనిల్ , బాలయ్య మరియు నర్సరీ నిర్వాహకులు పాల్గొన్నారు.