నిరుపేదలకు సిఎం సహాయనిధి వరం జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామము లొ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ సిద్ధంవేణు పొత్తూరు గ్రామానికి చెందిన రొ౦డ్ల మల్లారెడ్డి కి 45500 వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబసభ్యులకు.అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుంది. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంత గానో ఉపయోగ పడుతుందని అన్నారు. మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి వర్యులు కేటీ రామారావుకి, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ & మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఎంపీటీసీ పట్నం అశ్వినీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ పర్శరాములు గౌడ్, Pacs డైరక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కదురు శేఖర్,గుంటి అంజి, పి.కుమార్ బి.శ్రీనివాస్ గౌడ్ కె. రాజేశం బి.వీరయ్యగౌడ్ మల్లయ్య బి. అనిల్ గౌడ్ ch అమర్ గౌడ్ గుంటి మధు నాయకులు తదితరులు పాల్గొన్నారు.