మానకొండూర్ నియోజకవర్గాని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
రసమయి బాలకిషన్
తెలంగాణ రాష్ట సాంస్కృతిక సారథి చైర్మేన్
మానకొండూర్ శాసన సభ్యులు
ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లిపెల్లి,పత్తికుంటపల్లె,కేశన్నపల్లె,పెద్దలింగాపూర్,దాచారం గ్రామాలలో పర్యటించారు,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంఫణి,దళిత బందు పనుల పరిశీలన,సెస్ పనుల ప్రారంభోత్సం,మృతుల కుటుంబాల పరమార్శ,
అనంతరం రసమయి మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. 2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు.భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని అన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు.
ప్రజలకు కావలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మానకొండూర్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు.