పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

0
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామ అంగన్వాడీ కేంద్రం లో పోషన్ అభియాన్ లో భాగంగా గర్భిణులు , బాలింతలు , చిన్నారులకు రక్తహీనత గురించి అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ , సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి లు హాజరయ్యారు... ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ పౌష్టికాహారం తోనే సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటామని అన్నారు.. ప్రభుత్వం ఇచ్చే బాలామృతం , గుడ్లు , పాలు తప్పనిసరిగా తీసుకోవాలి అని అన్నారు. అనంతరం గర్భిణులకు , బాలింతలకు బాలామృతం మరియు గుడ్లను అందించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి , మండల వైద్యాధికారి రేణుక , అంగన్వాడీ టీచర్లు పద్మశ్రీ , విజయలక్ష్మి, రజిత , ఏ. న్. ఎం లు జ్యోతి , కవిత ఆశాలు విజయ , పద్మ , సౌమ్య , అంగన్వాడీ ఆయాలు , తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top