బాధిత కుటుంబానికి బియ్యం అందజేత
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన బండారి రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం, 1000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, టౌన్ అధ్యక్షులు తిప్పారపు శ్రావణ్, సీనియర్ నాయకులు రంగు రమేష్, మధుసూదన్ రెడ్డి, చంద్రం, సాయి తదితరులు పాల్గొన్నారు.