శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అధితిగా మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో నిశాన్, దో ప్రధాన్ దో విధాన్ నహీ చెలేగా నహీ చెలేగా అంటూ నినాదం చేసి దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత..శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని వారి త్యాగాలను గుర్తు చేశారు
బ్రిటిష్ వారు భారత దేశాన్ని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పాకిస్తాన్ పుట్టక ముందే దాన్ని చీల్చిన ఘనత ఆయనది దేశంలో జాతీయవాద రాజకీయానికి ఆ మహనీయుని అంకురార్పన ఇవాళ బీజేపీ రూపంలో మహావృక్షంగా విస్తరించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని
ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ ను దేశంలో సమైక్య భాగంగా గుర్తించాలంటూ ఉద్యమించిన మహానేత ఆయన..ఆయన కల నెరవేరినది అని. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత దేశం పూర్తి భద్రతతో క్షేమం గా సురక్ష గా సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తో దేశం ముందుకు సాగుతున్నది అని తెలిపారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా బిజెపి కార్యకర్తలు అందరం కూడా పాటు పడుదాం అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు తిప్పారాపు శ్రవణ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రొండ్ల మధుసూదన్ రెడ్డి,బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్న, దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, సీనియర్ నాయకులు రంగు రమేష్, మ్యాకల మల్లేశం, దయ్యల రాజు, లోకోజ్ చంద్రం లు పాల్గొన్నారు.