వృద్ధురాలికి అండగా జిల్లా పోలీస్ బాస్

0
వృద్ధురాలికి అండగా జిల్లా పోలీస్ బాస్

గత నెలలో పోలీస్ నేస్తం కార్యక్రమంలో భాగంగా తన బంగారం పోయిందని ఎస్పీకి గోడు వెళ్లబోసుకున్న ఎల్లవ్వ

తులం విలువగల బంగారు చైన్ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 
  23 జూన్ , ఇల్లంతకుంట :
 మండలంలోని మెళ్లాచెరువు (తెనుగువానిపల్లి) గ్రామ పరిధిలో మే 13 వ తేదీన ప్రజలతో మమేకం కావడానికి నిర్వహించిన పోలీస్ నేస్తం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  రాహుల్ హెగ్డే పాల్గొన్నారు. 
గ్రామానికి చెందిన దరవేణి ఎల్లవ్వ అనే వృద్ధురాలు జిల్లా ఎస్పీ  దగ్గరికి వచ్చి బయటకు వెళ్ళినపుడు తన బంగారం పోయిందని తన గోడు వెళ్లబోసుకుంది. చలించిపోయిన జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి నువ్వేం బాధ పడకు ఎల్లమ్మ అని ధైర్యం చెప్పి, స్వంత ఖర్చులతో నీకు బంగారు చైన్ చేపిస్తాను అని మాట ఇచ్చారు.
ఎల్లవ్వకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో దరవేణి ఎల్లవ్వకు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో తులం విలువ గల బంగారు చైన్ ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఎల్లవ్వ జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల రూరల్ సి.ఐ ఉపేందర్  ఎస్.ఐ మహేందర్, సర్పంచ్ వంచ అనసూయ-చంద్రారెడ్డిపాల్గొన్నారు..

*ఎస్పీ ప్రత్యేక చొరవతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం*

మెళ్లాచెరువు (తెనుగువానిపల్లి) గ్రామంలో నిర్వహించిన పోలీస్ నేస్తం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఆ గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా ఎస్పీ కి విన్నవించారు. 

ఆర్టీసీ ద్వారా బస్ సౌకర్యం కల్పించాలని, సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని, కొనుగోలు చేసిన ధాన్యం తరలించడంలో వేగవంతం చేసేలా సంబంధిత అధికారులకు సూచించాలని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. 

వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించడానికి ప్రత్యేక చొరవ తీసుకుని ఆ గ్రామానికి లారీలు పంపించి కొనుగోళ్ళు వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేశారు. 

కరీంనగర్ నుండి సిరికొండ వరకు ఉన్న బస్ సౌకర్యం కరీంనగర్  డిపో మేనేజర్ తో మాట్లాడి దానిని మెళ్లాచెరువు వరకు రావడానికి కృషి చేశారు.

అదేవిధంగా జియో టెలికాం సంస్థ యాజమాన్యంతో మాట్లాడి పెద్దలింగాపూర్, సిరికొండ  గ్రామాలలో ఉన్న జియో టవర్స్ యెక్క కెపాసిటీ పెంచి గ్రామానికి సిగ్నల్ వచ్చేవిధంగా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top